📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పేదల పైసలు వేల కోట్ల చట్టబద్ధ దోపిడి – ఆపలేరా?

పేదల పైసలు వేల కోట్ల చట్టబద్ధ దోపిడి – ఆపలేరా?

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి24)భారతదేశం డిజిటల్ విప్లవంలో దూసుకుపోతోందని సంబరపడుతున్న తరుణంలో,అదే డిజిటల్ మాధ్యమాల సాక్షిగా సామాన్యుడి జేబుకు అడ్డగోలుగా చిల్లు పడుతోంది. పార్లమెంట్‌లో ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలు కేవలం రాజకీయ విమర్శలు కావు. అవి ప్రతి మధ్యతరగతి,పేద కుటుంబం నిత్యం ఎదుర్కొంటున్న చేదు నిజాలు. టెలికాం సంస్థల 28 రోజుల రీఛార్జ్ మాయాజాలం నుండి బ్యాంకుల కనీస నిల్వ పెనాల్టీల వరకు.వ్యవస్థాగతంగా జరుగుతున్న ఈ దోపిడీపై కేంద్ర ప్రభుత్వం,నియంత్రణ సంస్థలు ఉదాసీనంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది.సామాన్యుడి రక్తాన్ని పీలుస్తున్న ఈ కార్పొరేట్ శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత పాలకులపై లేదా అన్న ప్రశ్న వస్తోంది.28 రోజుల రీచార్జ్ ప్లాన్ లెక్కేంటి?టెలికాం రంగంలో జరుగుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ ఒక పెద్ద చట్టబద్ధమైన స్కామ్ అని చెప్పక తప్పదు. ఏడాదికి 12 నెలలు ఉంటే,ఈ 28 రోజుల నిబంధన వల్ల వినియోగదారుడు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోంది. అంటే,ప్రతి వినియోగదారుడి నుండి ఏడాదికి ఒక నెల అదనపు ఆదాయాన్ని టెలికాం కంపెనీలు అక్రమంగా లాగేసుకుంటున్నాయి. దీనికి తోడు, రీఛార్జ్ ముగిసిన మరుక్షణమే ఇన్‌కమింగ్ కాల్స్, కనీసం బ్యాంక్ ఓటీపీలు వచ్చే ఎస్సెమ్మెస్‌లను కూడా నిలిపివేయడం ఏ రకమైన న్యాయం? సమాచార హక్కును కాలరాయడమే కాకుండా, అత్యవసర సమయాల్లో సామాన్యుడిని నిస్సహాయుడిని చేస్తున్న ఈ నిబంధనలను ట్రాయ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? వినియోగదారుడు డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన డేటా మిగిలిపోతే, అది అర్ధరాత్రితో ఆవిరైపోవాలా? వాడని డేటాను తర్వాతి రోజుకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించకపోవడం దోపిడీ కాక మరేమిటి? అన్నది అందరిలోనూ కనిపించే ఆగ్రహం మినిమం బ్యాలెన్స్ పేరుతో రూ.19వేల కోట్ల లూఠీ బ్యాంకింగ్ రంగం సామాన్యుడి పట్ల చూపిస్తున్న కఠినత్వం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. బ్యాంకుల్లో కనీస నిల్వ లేదనే సాకుతో గత మూడేళ్లలో సుమారు 19,000 కోట్ల రూపాయలను పెనాల్టీల రూపంలో వసూలు చేయడం అత్యంత దారుణం. అసలే డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న పేదవాడి ఖాతా నుండి పెనాల్టీల పేరుతో ఉన్నకాస్త సొమ్మును కూడా గుంజేసుకోవడం ఏ రకమైన న్యాయం. కార్పొరేట్ కంపెనీల వేల కోట్ల అప్పులను మాఫీ చేస్తున్న బ్యాంకులు, సామాన్యుడి చిల్లర పైసల కోసం ఇంతగా కక్కుర్తి పడటం పాలకుల ప్రాధాన్యతలను ప్రశ్నార్థకం చేస్తోంది.చూడటానికి చిన్నవే కానీ.వేల కోట్ల స్కాములు మొబైల్ కనెక్టివిటీ , బ్యాంకింగ్ సేవలు ఈ రోజుల్లో విలాసం కాదు,అవి ప్రాథమిక అవసరాలు.డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం,ఆ లావాదేవీలు చేసే సామాన్యుడి ప్రయోజనాలను కాపాడటంలో మాత్రం విఫలమవుతోంది.రాఘవ్ చద్దా లేవనెత్తిన ఈ అంశాలు కోట్లాది మంది ప్రజల ఆవేదనకు ప్రతిరూపాలు. కనీసం ఇప్పటికైనా కేంద్రం స్పందించాల్సి ఉంది. పారిశ్రామికవేత్తల లాభాల కంటే సామాన్యుడి బతుకు భారమవ్వకుండా చూడటమే అసలైన సుపరిపాలన అని కేంద్రం గుర్తించాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.