పేదల పైసలు వేల కోట్ల చట్టబద్ధ దోపిడి – ఆపలేరా?
ప్రజావాణిన్యూస్(మార్చి24)భారతదేశం డిజిటల్ విప్లవంలో దూసుకుపోతోందని సంబరపడుతున్న తరుణంలో,అదే డిజిటల్ మాధ్యమాల సాక్షిగా సామాన్యుడి జేబుకు అడ్డగోలుగా చిల్లు పడుతోంది. పార్లమెంట్‌లో ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలు కేవలం రాజకీయ విమర్శలు కావు. అవి ప్రతి మధ్యతరగతి,పేద కుటుంబం నిత్యం ఎదుర్కొంటున్న చేదు నిజాలు. టెలికాం సంస్థల 28 రోజుల రీఛార్జ్ మాయాజాలం నుండి బ్యాంకుల కనీస నిల్వ పెనాల్టీల వరకు.వ్యవస్థాగతంగా జరుగుతున్న ఈ దోపిడీపై కేంద్ర ప్రభుత్వం,నియంత్రణ సంస్థలు ఉదాసీనంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది.సామాన్యుడి రక్తాన్ని పీలుస్తున్న ఈ కార్పొరేట్ శక్తుల ఆగడాలకు...