📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetజాబ్ క్యాలెండర్,ఫీజ్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

జాబ్ క్యాలెండర్,ఫీజ్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

📰 Generate e-Paper Clip

బెజ్జంకి,మార్చి 24(ప్రజావాణి )

బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పోలీసులు బి ఆర్ఎస్ వి నియోజకవర్గ నాయకులు పొట్లపల్లి శివకృష్ణ, టిఆర్ఎస్వి బెజ్జంకి మండల అధ్యక్షులు చాతవేణి యాదవ్ నీ ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కీ తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని గుర్తు చేస్తూ, ఎన్నికల వాగ్దానాలలో భాగంగా విద్యార్థులకు కేటాయిస్తామని చెప్పిన 15శాతం విద్య వ్యవస్థకు నిధులు,రెండు లక్షల ఉద్యోగాలు, విద్య భరోసా కార్డు, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్ ల విడుదల వంటి వీ ఎన్నికలలో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయాలని కోరుతూ, శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి చేపట్టాలని నిర్ణయించుకున్న విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం బిఆర్ఎస్వి పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular