📄 ePaper
Epaper 2
Thursday, September 24, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetమద్యం సేవించి వాహనం నడిపిన 19 మందికి రూ.1,93,000- జరిమానా..-డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన...

మద్యం సేవించి వాహనం నడిపిన 19 మందికి రూ.1,93,000- జరిమానా..-డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఇద్దరికీ కలిపి రూ.10,000- జరిమానా

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్, మార్చి 24, ప్రజావాణి

సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 19 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా . 24-మార్చి-2026 రోజున సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి, ముందు హాజరుపరచగా విచారణ చేసి 19 మంది వ్యక్తులకి రూ.1,93,000- జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు డ్రైవింగ్ లైసెన్స్ లేని ఇద్దరికీ కలిపి రూ. 10,000- జరిమాన విధించినారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టడి చేయడానికి, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారికి ప్రమాదం మరియు రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమని ప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ గారు విచారణ జరిపి 10 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. పదివేల రూపాయలు కట్టడం వల్ల మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రజల్లో వాహనదారుల్లో అవగాహన రావడం జరుగుతుందన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు నడిపినచో ఒక్కొక్కరికి 5000- రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.