📄 ePaper
Friday, March 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బాధితులకు న్యాయం జరిగేలా, నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలి''ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్...

బాధితులకు న్యాయం జరిగేలా, నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలి”ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్కడప మార్చి24:సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపర్చి బాధితులకు న్యాయం జరిగేలా, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు కోర్ట్ మానిటరింగ్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని కోర్టు మానిటరింగ్ సిబ్బంది,పోలీస్ స్టేషన్ లకు చెందిన కోర్టు కానిస్టేబుళ్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. పెండింగ్ ట్రయల్ కేసుల్లో సత్వర,సక్రమ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరచడం,వారికి ధైర్యం చెప్పి శిక్షల శాతం పెంచేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.పి.పిలతో,న్యాయ వ్యవస్థ తో వృత్తి పరమైన సత్సంబంధాలు కొనసాగిస్తూ మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడాలని ఆదేశించారు. కోర్టులలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన అనంతరం కోర్ట్ ద్వారా సంబంధిత కేసులలో సి.సి నెంబర్లను తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎప్పటికప్పుడు పెండింగ్ సమన్లు జారీ అయ్యేలా,వారెంట్లు అమలు జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.నూతనంగా అమలులోకొచ్చిన బి.ఎన్.ఎస్.ఎస్ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కొత్త చట్టం మేరకు కోర్టు ప్రొసీడింగ్స్ జరిగేలా చూడాలని జిల్లా ఎస్.పి గారు ఆదేశించారు.ప్రతి కోర్టు కానిస్టేబుల్ విధిగా తన పోలీస్ స్టేషన్ కు సంబంధించి కోర్టులో హాజరవుతున్న ప్రతి కేసు గురించి అవగాహన పెంచుకుని సరైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. కోర్టు ట్రయల్ సందర్భంలో సంబంధిత స్టేషన్ హౌస్ అధికారి కూడా సమర్ధవంతంగా కేసు విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి గారు ఆదేశించారు. సమావేశంలో కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ ఎస్.వినయ్ కుమార్ రెడ్డి,డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది,కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, కడప

RELATED ARTICLES
- Advertisment -

Most Popular