📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్జన బాట కార్యక్రమం ద్వారా విద్యుత్ సమస్యల పై ఎప్పటికప్పుడు సిబ్బంది జనాలకు అందుబాటులో ఉండాలి.....

జన బాట కార్యక్రమం ద్వారా విద్యుత్ సమస్యల పై ఎప్పటికప్పుడు సిబ్బంది జనాలకు అందుబాటులో ఉండాలి.. ఎస్ఇ ..

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి24బద్వేల్ అట్లూరు లోని కే.జీ.బీ.వీ పాఠశాలను సందర్శించిన ఎస్ఇ.కరెంటోళ్ల జన బాట” కార్యక్రమం లో భాగంగా ఏ.పీ.ఎస్పీడీ.సీ.ఎల్ కడప సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ .రమణ గారు ఈ రోజు ముందుగా అట్లూరు మండలం  అట్లూరు ను, అనంతరం బద్వేల్ మండలం–చింతపుత్తయ్యపల్లి గ్రామంను సందర్శించారు.సెక్షన్ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో ఎస్ఇ  రెండు ప్రాంతాల్లోని విద్యుత్ సరఫరా వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించారు. లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు,కనెక్షన్లు,లోడ్ పరిస్థితులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి,ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా ముందస్తు మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.సిబ్బంది తో మాట్లాడిన ఎస్ఇ  వినియోగదారుల సమస్యలపై వెంటనే స్పందించాలని,ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, నాణ్యమైన,నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో రాజీ లేకుండా పనిచేయాలని సిబ్బందికి ఆదేశించారు. గ్రామస్తులు విద్యుత్ సరఫరా పట్ల, శాఖ సిబ్బంది సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఏ.పీ.ఎస్పీడీ.సీ.ఎల్వి నూత్నంగా ప్రారంభించిన “కరెంటోళ్ల జన బాట” కార్యక్రమం ద్వారా వినియోగదారుల సమస్యలను వారి ఇంటి వద్ద నుండే తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే లక్ష్యమని  ఎస్ఇ  తెలిపారు. ఆఖరి వినియోగదారుని వరకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించబడిందని వివరించారు.అదనంగా, గ్రామస్తులకు పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందే విధానం,విద్యుత్ ప్రమాదాల నివారణకు సంబంధించిన భద్రతా నియమాలు,పై అవగాహన కల్పించారు. అట్లూరు లోని కే.జీ.బీ.వీ పాఠశాలను సందర్శించిన ఎస్ఇ, విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించారు.విద్యార్థులకు విద్యుత్ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు,భద్రతా సూచనలు, ప్రమాదాల నివారణ చర్యలను వివరించారు.ఈ కార్యక్రమంలో డీఈఈ కుల్లయ్యప్ప, ఏఈ శర్మిల,ఏఈ కృష్ణ,మరియు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.