📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బెల్ట్ జోరు దమ్ముంటే పట్టుకోండి '''పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు పోలీసులకు సవాలుగా బెల్ట్ షాపుల నిర్వాహణ

బెల్ట్ జోరు దమ్ముంటే పట్టుకోండి ”’పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు పోలీసులకు సవాలుగా బెల్ట్ షాపుల నిర్వాహణ

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి23)పోరుమామిళ్ల మండలంలో అన్ని గ్రామాలలో మద్యం బెల్ట్ షాపులు ఊరూరా విచ్చలవిడిగా సాగుతున్నాయి.కూటమి ప్రభుత్వంలో బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి నుంచి జిల్లా ఎక్సైజ్ అధికారులు వరకు హెచ్చరించినప్పటికీ యదేచ్చగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.మరోవైపు బెల్టు షాపులకు అమ్మకాలు చేసిన వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని సీఎం హెచ్చరికలు జారీ చేసిన అవేవీ పట్టించుకోకుండా బెల్టు షాపుల నిర్వాహనకు సిండికేట్ మద్యం దుకాణాలకు దుకాణదారులు పూర్తిస్థాయిలో ప్రోత్సహించడంతో ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది,రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలల అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తుంటే అలాంటి పాఠశాలల దగ్గరలో మద్యం విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారని గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ప్రతి గ్రామాల్లో రామాలయాలు నిర్మించాలని చూసిన చేస్తుంటే అలాంటి రామాలయాల ప్రక్కన బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు భక్తులు గుడికి వెళ్లాలంటే మందు బాబులు ఏం చేస్తారో అని గుడికి వెళ్ళటం కూడా ఆగిపోతున్నారు ఇలా గ్రామాలలో బెల్టు షాపులు జోరుగా మద్యమం విక్రయాలు జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు కు బెల్ట్ షాపులు కనిపించడం లేదా అని వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు మండలంలోని సుమారు 30 30 బెల్ట్ షాపుల మధ్యమం విక్రయాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు పూతూ మంత్రంగానే కేసులు నమోదు చేశారు ఒక్కొక్క క్వాటర్ బాటిల్ కు 20 నుండి 30 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు బెల్ట్ షాపులు కారణంగా రాత్రి పగలు తేడా లేకుండా మద్యమం 24 గంటలు అందుబాటులో ఉంటుంది మద్యం నిత్యం అందుబాటులో ఉండటం ద్వారా అసాంఘిక కార్యక్రమాలు మరియు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మద్యానికి బానిసై దొంగతనాలు కూడా యువత అలవాటు పడుతున్నారు ఎక్సైజ్ అధికారులు నెల నెల లక్షల రూపాయల లో మామూలు అందుతున్నాయని ప్రజలు సైతం వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు పోలీసులు బెల్ట్ షాపులు నిర్వహణపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నాడు మిగతా వివరణ రేపటి భాగంలో చూద్దాం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular