📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోండి --ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ను కోరిన ఏపీ.ఎం.పీ.ఏ నాయకులు

జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోండి –ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ను కోరిన ఏపీ.ఎం.పీ.ఏ నాయకులు

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్విజయవాడ,మార్చి23:జర్నలిస్టుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంతో పాటు నగరంలో జర్నలిస్టులకు ప్రత్యేక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఏపీ ఎంపీ ఏ) ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నగర,జిల్లా అధ్యక్షులు తాళ్లూరి అనిల్ కుమార్,బొడ్డు విజయ్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాఖమూరి మల్లికార్జునరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యేమినేని వెంకటరమణ,రాష్ట్ర కోశాధికారి మత్తి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి చైతన్య తో పాటు నగర, జిల్లా నాయకులు కలెక్టర్‌ను కలిసి రెండు మెమోరాండంలను సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే అత్యధికంగా అక్రిడిటేషన్లను పారదర్శకంగా నిర్వహించి అందజేసినందుకు కలెక్టర్‌కు శాలువా కప్పి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ సేవలను ప్రశంసించారు. వినతిపత్రాల్లో ప్రధానంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు,ఇన్సూరెన్స్,నివాస స్థలాలు, బ్యాంకు రుణాలపై సబ్సిడీలు కల్పించడంతో పాటు నగరంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు చేయాలని స్పష్టంగా కోరారు. జర్నలిస్టులు సమావేశాలు,చర్చలు,వృత్తి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రెస్ క్లబ్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరంలో అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని సూచించారు. జిల్లాలో సుమారు 2000 మంది పైగా జర్నలిస్టులు ఉన్నప్పటికీ వారికి తగిన సదుపాయాలు అందడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు వేల్పుల ప్రశాంత్,కోటా రాజా నాయకులు శ్రీధర్,ఎన్ శ్రీనివాసరావు,ప్రభాకర్,ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు మరకాల గోపి, ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాశ్, కోశాధికారి మల్లెల శ్రీనివాసరావు, మెటికల శ్రీనివాసరావు, తోట ప్రసాద్,రవి,రాంబాబు కృష్ణారెడ్డి, వైడీపీ రెడ్డి,ఎస్‌కే వలి,శ్రీధర్ రాజా,మల్లి సర్వేశ్వరరావు,మైలవరం నియోజకవర్గ జాయింట్ సెక్రటరీ పామర్తి సత్య,కార్యదర్శి మల్లాది తిరుపతిరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ మన్నే సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular