జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోండి –ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ను కోరిన ఏపీ.ఎం.పీ.ఏ నాయకులు

ప్రజావాణిన్యూస్విజయవాడ,మార్చి23:జర్నలిస్టుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంతో పాటు నగరంలో జర్నలిస్టులకు ప్రత్యేక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఏపీ ఎంపీ ఏ) ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నగర,జిల్లా అధ్యక్షులు తాళ్లూరి అనిల్ కుమార్,బొడ్డు విజయ్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాఖమూరి మల్లికార్జునరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యేమినేని వెంకటరమణ,రాష్ట్ర కోశాధికారి మత్తి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి చైతన్య తో...