📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamఎన్ ఎస్ పి కాలువ తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన "ఘనులు"

ఎన్ ఎస్ పి కాలువ తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన “ఘనులు”

📰 Generate e-Paper Clip

*అక్రమార్కులకు” కోట్ల” వర్షం కురిపించిన” ఆ వాగు లిఫ్టు”

*ఎన్ ఎస్ పి కాలువ తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన “ఘనులు”

*అక్రమార్కులకు” కోట్ల” వర్షం కురిపించిన” ఆ వాగు లిఫ్టు”

*సాగర్ పుట్టుక నుండి ఉన్న కాలువలు కనుమరుగు…!

పట్టించుకోని ఎన్ ఎస్ పి అధికారులు



ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించిన కొందరు అధికారులు…?

నీళ్లు నమ్ములుతున్న కొందరు.. క్షేత్రస్థాయిలో రికార్డులు చూసి చెప్తారట..?



మున్సిపాలిటీ పరిధిలో  మేనేజ్ చేసిన అక్రమార్కులు

స్టేట్ బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

రాజు ఆజ్ఞలతో రాజ్యపాలన కొనసాగుతుంది. ప్రభుత్వ రికార్డులను సైతం తమ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా అనుమతులు పొందేందుకు తమకున్న పలుకుబడి పరపతి అధికారంతో సూర్యాపేట జిల్లా లోని ఓ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో గత ప్రభుత్వ హయాంలో అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారు లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో భూమి సేకరించి కాలువలను నిర్మాణం చేసినట్లు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నప్పటికీ ఓ గ్రామంలో వాగుపై ఓ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సుమారు 32 సంవత్సరాల నుండి రైతుల భాగస్వామ్యంతో సుమారు 400 ఎకరాలకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం కొనసాగిస్తున్న నేపథ్యం. ఈ గ్రామానికి చెందిన రైతులు లిఫ్ట్ పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటూ వ్యవసాయం చేస్తున్న పరిస్థితిని ఒడిసి పట్టిన కొందరు అధికారులు ఇదే అదునుగా భావించి కాలువను సైతం వెంచర్లలో కలుపుకొని లాభసాటి వ్యాపారం నిర్వహించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.  నాటి ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన కొందరు అధికారులు సైతం తమ పలుకుబడి పరపతి రాజకీయ అండదండలతో ఎన్ఎస్ పీ కాలువ ఉన్నప్పటికీ అనుమతులు పొంది దర్జాగా కోట్లాది రూపాయల వ్యాపారం నిర్వహించినట్లు స్థానికులు నియోజకవర్గ ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పరపతి పలుకుబడి అధికారం పెట్టుబడిగా కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. కాగా కాలువలు పూర్తిగా ధ్వంసమై రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బడా బాబులకు కాసులు వర్షం కురిపించిన తర్వాత ఇప్పుడు క్షేత్రస్థాయిలో వెళ్లి రికార్డులను పరిశీలించి వివరాలు వెల్లడిస్తామంటూ మరో అధికారి వ్యాఖ్యానించటం విశేషం. కాగా కొందరు విలాసవంతమైన భవనాలను సైతం నిర్మించుకున్నట్లు సమాచారం.

*ఎన్ఎస్ పీ కాలువ కనుమరుగులో కళ్ళు చెదిరే నిజాలెన్నో.. ఇంతకీ.. ఆ బడా బాబులెవరు..? అధికారులే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారా… మరికొన్ని సమగ్ర వివరాలతో… రేపటి కథనం..2లో వేచి చూడండి….!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.