📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarబరిగెలపల్లిలో పెద్దమ్మతల్లి ఆలయానికి భూమి పూజ

బరిగెలపల్లిలో పెద్దమ్మతల్లి ఆలయానికి భూమి పూజ

📰 Generate e-Paper Clip

మన ప్రజావాణి, చిగురుమామిడి:
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బరిగెలపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల సర్పంచ్‌లు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని భూమి పూజను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి సన్నీల కవిత వెంకటేష్ మాట్లాడుతూ….. ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణం గ్రామానికి శుభప్రదమని పేర్కొన్నారు. గ్రామ పెద్దల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని ఏడాది లోపు పూర్తి చేయాలని సూచించారు. పెద్దమ్మతల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ఆలయ కమిటీ అధ్యక్షులు బరిగెల వెంకటయ్య, చిన్న కొమురయ్య, సర్పంచ్ లు సన్నిల కవిత వెంకటేష్, గునుకుల మధుసూదన్ రెడ్డి, కటం సంపత్ రెడ్డి, వార్డు మెంబర్స్ మంద శ్రీనివాస్ వెంకటేశం గౌడ్ అన్నవేణి శ్రీనివాస్ మౌనిక,ముదిరాజ్ సంఘం సొసైటీ అధ్యక్షులు గట్టు శ్రీనివాస్, కార్యదర్శి కూన ముత్తయ్య,గట్టు ప్రశాంత్, కమిటి సభ్యులు రాజు, బాబు, శ్రీనివాస్, లచ్చయ్య ,బాలయ్య, రాజయ్య ,అఖిల్, సదానందం, వెంకటేష్, తిరుపతిరెడ్డి, పరశురామ్ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.