📄 ePaper
Sunday, March 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ గారి కార్యాలయంలో ఉగాది సంబరాలు

కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ గారి కార్యాలయంలో ఉగాది సంబరాలు

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి19)బద్వేల్ లోని కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ గారి కార్యాలయంలో ‘పరాభవ‘నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు పాల్గొని పంచాంగ శ్రవణం విన్నారు.ఈ సందర్భంగా కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ,సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి మళ్లీ అద్భుత రాజధానిగా సాకారం కాబోతోందని కల్తీలేని పారదర్శక పాలన ప్రజలకు అందుతుందని ధీమా వ్యక్తం చేశారు.సిద్ధాంతి సత్యనారాయణ గారు చెప్పినట్లుగానే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, లోకేష్ బాబు ఆధ్వర్యంలో విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.అనంతరం సిద్ధాంతి గారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular