📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyఅవగాహన సదస్సు నిర్వహించిన పోలీస్ కళాబృందం

అవగాహన సదస్సు నిర్వహించిన పోలీస్ కళాబృందం

📰 Generate e-Paper Clip

అవగాహన సదస్సు నిర్వహించిన పోలీస్ కళాబృందం

ప్రజావాణి | కామారెడ్డి జిల్లా ప్రతినిధి | మార్చి 16

మద్దూనూర్ మండలం పరిధిలోని పెద్ద ఎకలారా సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలలో విద్యార్థినుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. మైనర్లపై జరుగుతున్న నేరాలు, ప్రేమ పేరుతో మోసాలు, సైబర్ నేరాలు మరియు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు పోలీసులు వివరించారు.

కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు మద్దూనూర్ సబ్‌ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీస్ కళాబృందం సభ్యులు మాటలు, పాటల ద్వారా విద్యార్థినుల్లో చైతన్యం కలిగించేలా సందేశాలు అందించారు.

ఈ సందర్భంగా షీ టీమ్ హెల్ప్‌లైన్ నంబర్ 8712686094, సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930, అత్యవసర పరిస్థితుల్లో 100 కి కాల్ చేయాలని సూచించారు. సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, చిన్న పొరపాట్లు జీవితాన్ని ప్రభావితం చేస్తాయని హెచ్చరించారు. తల్లిదండ్రుల మాట వినడం, చదువుపై దృష్టి పెట్టడం ఎంతో ముఖ్యమని విద్యార్థినులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషరావు, పిసి సాయిలు పాల్గొన్నారు. అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న, హెడ్ కానిస్టేబుల్ ఈ. శ్రీనివాస్, డబ్ల్యూ పిసి సుజాత, హెడ్ కానిస్టేబుల్ హేమాద్రి, షీ టీమ్ సభ్యులు పిసి అనిల్, డబ్ల్యూ పిసి పార్వతి, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular