📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetబండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి

బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి

📰 Generate e-Paper Clip

*బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి*

*సాధారణ ప్రజలకు ఓ నీతి.. మంత్రి కొడుక్కి మరో నీతా*


  కోదాడ బి.ఆర్.ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు  ఎం.డి ఇమ్రాన్ ఖాన్.
కోదాడ, మే 11/ ప్రజావాణి
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైనా చర్యలు తీసుకోకపోవడం పట్ల యువజన విభాగం అధ్యక్షులు  ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాధారణ ప్రజలకు ఓ నీతి.. మంత్రి కొడుక్కి మరో నీతా అని ప్రశ్నించారు. బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని విమర్శించారు. ఒక మైనర్ బాలిక మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బాధితురాలు,ఆమె కుటుంబాన్ని నేరస్థుల్లా వేధించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.“బేటీ బచావో” అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే బీజేపీ నాయకత్వం,ఇప్పుడు కేంద్ర మంత్రి కుటుంబంపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎందుకు మౌనం వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ  వెంటనే స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular