📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarవడదెబ్బతో మృతి చెందిన బాల్యమిత్రుని కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు..

వడదెబ్బతో మృతి చెందిన బాల్యమిత్రుని కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు..

📰 Generate e-Paper Clip

రూ.56,116 ఆర్థిక సాయం అందజేత

మనప్రజావాణిప్రతినిధి (చిగురుమామిడి):చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ సత్యం ఇటీవల వడదెబ్బకు గురై మృతి చెందగా, అతని కుటుంబానికి చిగురుమామిడి జిల్లా పరిషత్ పాఠశాల 1989-90 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుతూ రూ.56,116 ఆర్థిక సాయం అందజేశారు.మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బాల్యమిత్రులు, సత్యం కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఓదార్చారు. చిన్ననాటి స్నేహితుడి కుటుంబానికి కష్టసమయంలో తోడుగా నిలవడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దాసరి మధుకర్, కొమ్మూరి రవీందర్ రెడ్డి, గుగ్గిళ్ళ ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, సంపత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వీరస్వామి గౌడ్, గోగూరి మురళి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular