📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల పై గళమెత్తిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల పై గళమెత్తిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి16)గుంటూరు నీటి కొరత నుంచి వీధి కుక్కల దాడి కేసుల వరకు పలు అంశాలపై అధికారులకు ప్రశ్నలునగర పాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం మరియు బడ్జెట్ పై నిర్వహించిన అత్యవసర సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి పాల్గొని నగరంలోని పలు ప్రజా సమస్యలను ప్రస్తావించారు.నీటి కొరత,టెండర్లలో పారదర్శకత,డ్రైనేజీ పనులు,వీధి కుక్కల సమస్య,శానిటేషన్,మార్కెట్ల పరిస్థితి వంటి అనేక అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.వేసవిలో నీటి సమస్యపై ఆందోళన నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీటి సమస్య కొనసాగుతోందని, రానున్న వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చని హెచ్చరించారు.డివిజన్ వారీగా ఉన్న బోరింగ్లను మరమ్మత్తులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.కొన్నిచోట్ల చిన్నపాటి మరమ్మత్తులు చేస్తేనే బోరింగ్లు పనిచేసే పరిస్థితి ఉందని తెలిపారు.టెండర్ ప్రక్రియలో అవకతవకలపై ప్రశ్న గత కొన్ని సంవత్సరాలుగా ఒకే కాంట్రాక్టర్లు అనేక పనులు కైవసం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.పనుల విలువకు 12 నుంచి 29 శాతం వరకు తక్కువ ధరకు టెండర్లు పొందుతున్నప్పటికీ పనులు సక్రమంగా పూర్తి చేయడం లేదని అన్నారు.

ఇలాంటి కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని సూచించారు.బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత అవసరం నిజాయితీగా పని చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఆలస్యమవుతుండగా పనులు మధ్యలో వదిలేసిన వారికి మాత్రం చెల్లింపులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.బిల్లుల చెల్లింపుల్లో స్పష్టమైన విధానం ఉండాలని,పారదర్శకంగా అమలు చేయాలని కోరారు.డ్రైనేజీ డీసిల్టేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలి వర్షాకాలానికి ముందే ప్రధాన డ్రైనేజీల డీసిల్టేషన్ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.ఇందుకోసం ప్రత్యేక వర్క్ క్యాలెండర్ రూపొందించి సభ్యులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.అనధికార హోర్డింగ్స్,ఎల్ఈడి బోర్డులపై చర్యలు నగరంలో అనధికార హోర్డింగ్స్ పెరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు.ఎల్ఈడి డిస్ప్లే బోర్డులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.వీటి అనుమతులు,బకాయిల వివరాలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు.పివికే నాయుడు మార్కెట్ సమస్యలు పివికే నాయుడు మార్కెట్ పరిస్థితి దయనీయంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.వర్షం పడితే మార్కెట్ మొత్తం నీటితో నిండిపోతుందని చెప్పారు.సుమారు 200 షాపులకు సరిపడా టాయిలెట్స్ లేవని,మార్కెట్ బయట అనధికారంగా వ్యాపారం జరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను కోరారు.వీధి కుక్కల సమస్యపై ఆందోళన నగరంలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా మారిందని ఎమ్మెల్యే తెలిపారు.గత నెలలో సుమారు 3 కుక్క కాటు కేసులు నమోదయ్యాయని, అందులో 900 కేసులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినవని చెప్పారు. సమస్య పరిష్కారానికి డాగ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.శానిటేషన్ వ్యవస్థపై సూచనలు పుష్ కార్ట్లు పాడైపోవడం వల్ల మహిళా శానిటేషన్ కార్మికులు వాటిని తోసుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.పాత పుష్ కార్ట్లను మార్చి కొత్తవి అందించాలని కోరారు.సచివాలయాల్లో కంప్యూటర్ల సమస్య పలు సచివాలయాల్లో కంప్యూటర్లు పనిచేయకపోవడం వల్ల సేవలు అందడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.వెంటనే టెండర్ ప్రక్రియ ద్వారా కొత్త కంప్యూటర్లు అందించాలని సూచించారు.కేంద్ర స్మైల్ పథకం అమలుపై వివరాలు కోరిన ఎమ్మెల్యే భిక్షాటన చేసేవారు,ట్రాన్స్‌జెండర్ల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ద్వారా వచ్చే నిధులు ఎలా వినియోగిస్తున్నారో వివరాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.ఈ పథకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అభివృద్ధి పనుల పురోగతిపై సంతృప్తి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాల్లో రూ.140 కోట్లతో 218 అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే తెలిపారు.మరో రూ.100 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. సగం వరకు ఆగిపోయిన పనులను ప్రాధాన్యంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు.
నగరంలోని సమస్యలపై లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలని,నిర్దిష్ట గడువులో పరిష్కారాలు చూపాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి నగర పాలక సంస్థ అధికారులను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular