📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్భూ కబ్జాదారుల చేతిలో మా పొలం.. కబ్జాదారులకు అధికారుల అండదండలు

భూ కబ్జాదారుల చేతిలో మా పొలం.. కబ్జాదారులకు అధికారుల అండదండలు

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి13)కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామ పొలంలో సర్వేనెంబర్ 458 లో 18 ఎకరాల 40 సెంట్లు కల భూమి ని కబ్జాకు గురైన వైనం.మా పూర్వీకుల ద్వారా సంక్రమించిన మా పొలమును ప్రకాశం జిల్లా వాసి గంజికుంట సుబ్బరాజేశ్వరరావు కబ్జా.రెవెన్యూ అధికారుల అన్నదండలతో తప్పుడు దృవపత్రాలు సృష్టించి ఆన్లైన్ చేసి రిజిస్టర్ చేసుకున్న కబ్జాదారుడు.అక్రమంగా నాలుగు బోర్లు వేయించి మూడు రోజుల పాటు ట్రాక్టర్లతో నాగలిచేద్యం దౌర్జన్యంగా చేయిస్తున్న కబ్జాదారుడు.ఫోర్జరీ డాక్యుమెంట్లతోమా పొలము కబ్జా చేసిన వారిపై రెవిన్యూ అధికారులకు మరియు పోలీసు శాఖకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకుపోగా మాపై తప్పుడు కేసులు బనాయించడం న్యాయమేనా,కబ్జాదారులు బోర్లు వేస్తున్న తరుణంలో పోలీస్ కానిస్టేబుల్ సమక్షంలో అక్కడ ఉంచి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం పోలీసులు ఆంతర్యం ఏమిటి?ఈ విషయంపై కాశి నాయన మండల తహసీల్దారును మీడియా వివరణ కోరగా కోరగా సరైన సమాధానం  ఇవ్వలేక దాటవేస్తున్న వైనం.మీడియా ప్రతినిధులు కాశినాయన మండల తాసిల్దార్ ను సర్వేనెంబర్ 458 పొలముపై జరుగుతున్న విషయంపై వివరణ  రెవెన్యూ అధికారులకు తెలిసినా తాసిల్దార్ పర్మిషన్ ఇవ్వకుండానే కోర్లు వేశారు పర్మిషన్ లేని బోర్లు వేసేందుకు పోలీస్ సిబ్బంది అర్ధరాత్రి అక్కడ ప్రొటెక్షన్ ఉన్నట్లు సమాచారం,

గంజికుంట సుబ్బరాజేశ్వరావు అనే వ్యక్తి తన అనుచరులతో దౌర్జన్యంగా బోర్లు వేయటం అధికారులను లోపరచుకొని ఈ ప్రాంత పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వారన్నారు అతను వేసిన బోర్లు ఏ పర్మిషన్తో అర్ధరాత్రి వేశాడని తాసిల్దారును బాధితులు ప్రశ్నిస్తే పర్మిషన్ నేను ఇవ్వలేదని చెప్తారే తప్ప ఆ బోర్లు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని వారన్నారు అసలు భూ సమస్యలు పోలీస్ అధికారులకు ఎలాంటి సంబంధం ఉంది అని వారు ప్రశ్నిస్తున్నారు తాసిల్దార్ ఎవరి భూమి అనేది నిర్ధారణ చేస్తే తప్ప పోలీస్ అధికారులు ఇలాంటి సమస్యల్లో చొరవ తీసుకోకూడదని జీవోలు ఉన్నా కాసినాయన పోలీసులు మాత్రం భూ కబ్జాలకి అండగా ఉంటూ పేదలకు అన్యాయం చేస్తున్నారని వారన్నారు తాసిల్దార్ అర్ధరాత్రి సమయంలో అక్రమoగ వేసిన బోర్లను సీజ్ చేయకపోతే అన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తూ చట్టపరమైన న్యాయస్థానికి వెళ్తామని వారు అన్నారు ఇక్కడ ఉన్నా తాసిల్దార్ వెంకటసుబ్బయ్య.భూ కబ్జాదారులకు ఎవరైతే రాజకీయ పలుకుబడి గల వారికి అండగా ఉంటూ వారు చెప్పిందే వేధంగా పాటిస్తూ పేదలకు పూర్తిగా అన్యాయం చేస్తున్నాడని వారు భూ కబ్జాదారులు, భూమి చదును చేస్తుంటే మేము అక్కడికి వెళ్ళకున్నా అక్కడ గొడవ చేసినట్లు కాశి నాయన ఎస్సై కేసు నమోదు చేయడం బాధాకరమైన విషయం అన్నారు విచారణ చేయకుండా కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.