📄 ePaper
Monday, March 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వృద్ధిడి ని నిర్లక్ష్యం చేసిన కుమారుడు భార్య పై. కేసు ...

వృద్ధిడి ని నిర్లక్ష్యం చేసిన కుమారుడు భార్య పై. కేసు నమోదు

📰 Generate e-Paper Clip

  1. వృద్ధుడిని నిర్లక్ష్యం చేసిన కుమారుడు, భార్యపై స్పాట్ ఎఫ్‌ఐఆర్ నమోదు

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీనగర్ ప్రాంతంలో వృద్ధుడిని నిర్లక్ష్యం చేసి ఆస్తి, నగదు తీసుకున్న ఘటనపై పోలీస్ కేసు నమోదు అయింది.మారుతీనగర్‌కు చెందిన అనంతుల శంకర్లింగం (82) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఇంద్రసేనారెడ్డి ఆదేశాలపై ఎస్ఐ రమేష్ ఫిర్యాదుదారుని ఇంటికి వెళ్లి స్పాట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.ఫిర్యాదు ప్రకారం, శంకర్లింగం మొదటి భార్య ధనలక్ష్మి మరణించిన తర్వాత భారతితో రెండో వివాహం చేసుకున్నారు. తనను చూసుకుంటాడనే నమ్మకంతో రెండో భార్య కుమారుడు అనంతుల పూర్ణచందర్‌కు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి, నగదు, బంగారం ఇచ్చినట్లు తెలిపారు.అయితే 2021లో ట్రాన్స్‌కోలో ఉద్యోగం వచ్చిన తరువాత కుమారుడు పూర్ణచందర్, భార్య కలిసి తన ఆస్తి, నగదు తీసుకుని తనను నిర్లక్ష్యం చేసినట్లు శంకర్లింగం ఆరోపించారు.ఈ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమేష్ విచారణ జరిపి స్పాట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular