📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakఇందిరమ్మ ఇంటి నిర్మాణం అడ్డం – కుటుంబానికి బెదిరింపులు

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం అడ్డం – కుటుంబానికి బెదిరింపులు

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం అడ్డం – కుటుంబానికి బెదిరింపులు

ప్రజావాణి / మెదక్

మెదక్ జిల్లా కేంద్రంలోని పదో వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం విషయంలో వివాదం చోటుచేసుకుంది. చింతల సంతోషి భర్త చింతల సిద్ధిరాములు తనకు కేటాయించిన ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునే క్రమంలో కొందరు వ్యక్తులు అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయం మరియు పట్టణ సీఐ మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ద్వారా కేటాయించిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఈ నెల 15వ తేదీ గురువారం తన సొంత స్థలంలో ప్రారంభించినట్లు సిద్ధిరాములు తెలిపారు. అయితే అదే ప్రాంతానికి చెందిన చింతల నరసింహులు మరియు అతని కుమారులు రాజకీయ కక్ష సాధింపు చర్యలతో ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారని పేర్కొన్నారు.

మొదట రెండు మూడు రోజులు పరిస్థితిని సహనంతో ఎదుర్కొన్నామని, కానీ తాజాగా మంగళవారం రోజున చింతల నరసింహులు కుమారులు ప్రదీప్, కార్తీక్ తమపై దాడికి పాల్పడి తీవ్రంగా బెదిరించారని సిద్ధిరాములు ఆరోపించారు. “నువ్వు ఇల్లు కట్టేది చూపిస్తా, నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తా, ఉన్న రేకుల ఇల్లును కూడా బుల్డోజర్లతో కూల్చేస్తా” అంటూ బెదిరింపులకు దిగారని తెలిపారు.

అంతేకాకుండా “కమిషనర్ నావోడే, ఎమ్మెల్యే నావోడే, నేను ఇందిరమ్మ కమిటీ మెదక్ అధ్యక్షుడిని” అంటూ తమపై ఒత్తిడి తెచ్చి ఇంటి నిర్మాణాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కూడా తప్పుడు పత్రాలతో తమ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సిద్ధిరాములు ఆరోపించారు.

తాత ముత్తాతల కాలం నుండి తమ కుటుంబానికి చెందిన సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటున్నామని, అయినా కూడా అడ్డంకులు సృష్టిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు తెలిపారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొంటూ సంబంధిత అధికారుల నుంచి రక్షణ కల్పించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular