సిద్దిపేట జిల్లా, మార్చి 10, ప్రజావాణి
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారుల మరియు సిబ్బంది సంక్షేమం కోసం “ఆరోగ్య ఖాకీ – పోలీస్ వెల్నెస్ & ఫిట్నెస్ ఇనిషియేటివ్” అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్,ముఖ్య అతిథిగా హాజరై హెల్త్ ప్రొఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యుల బృందం ఈ సందర్భంగా పోలీసులకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ , అదనపు డీసీపీ ఎఆర్ సుభాష్ చంద్రబోస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డి ఏం & హెచ్ ఓ ) డాక్టర్ ధనరాజ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. సురేష్ బాబు, ఆర్‌ఎంఓ జి. అనిల్, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిరంతర విధి నిర్వహణలో డాక్టర్లు పోలీసులు 24 గంటలు విధుల్లో ఉండే వృత్తులు. సమాజంలో ఎక్కడ సమస్య తలెత్తినా పోలీసులు అక్కడికి వెళ్ళాల్సిందే. అందుకే పోలీసులు ఎల్లప్పుడూ మానసికంగా , శారీరకంగా ఫిట్ గా ఉండాలని సూచించారు. నిరంతర పని ఒత్తిడి వల్ల 20, 30 ఏళ్ల వయసులో ఉన్న సిబ్బంది కూడా ఆహారం, నిద్ర, ఆరోగ్య అలవాట్లపై సరైన శ్రద్ధ చూపడం లేదు. ఇది పని సామర్థ్యాన్ని తగ్గిస్తుందని, అసలు మన శరీరంలో ఏదైనా సమస్య ఉందా లేదా అనేది అప్పుడప్పుడు ఇలా స్క్రీనింగ్ పరీక్ష చేసుకుంటూ ఉండాలని సూచించారు. ఆరోగ్యం అంటే కేవలం శారీరక దృఢత్వం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కూడా. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల పోలీసుల్లో ఆత్మహత్యల ప్రవృత్తి పెరుగుతోంది. శారీరక దృఢత్వం ఉంటేనే మానసిక బలం చేకూరుతుంది. సైకిల్ సజావుగా సాగాలంటే రెండు చక్రాలు ఎలా ముఖ్యమో, మనిషికి శారీరక మానసిక ఆరోగ్యం అంతే ముఖ్యం. ఈ ప్రారంభ దశలో మొదటి రోజు 200 మంది పోలీస్ సిబ్బందికి వివిధ పరీక్షలునిర్వహించారు. ఈ చొరవ ద్వారా ప్రతి పోలీస్ అధికారికి ఒక వ్యక్తిగత హెల్త్ ప్రొఫైల్రూపొందించబడుతుందిరిపోర్టుల ఆధారంగా ఎవరికైనా అనారోగ్య సూచనలు ఉంటే, వాళ్ల ని ముందుగానే అప్రమత్తం చేసి తగిన వైద్య సలహాలు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకునేలా ప్రోత్సహిస్తామని సిపి రష్మీ పెరుమాళ్,పేర్కొన్నారు..



