📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetకొహెడ మండలంలోని బాలుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల లో రాత్రి భోజన ప్రక్రియను జిల్లా...

కొహెడ మండలంలోని బాలుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల లో రాత్రి భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనిఖీ..

📰 Generate e-Paper Clip

కొహెడ మండలంలోని బాలుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల లో రాత్రి భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనిఖీ..

సిద్దిపేట జిల్లా, మార్చి9, ప్రజావాణి

కొహెడ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల లో రాత్రి భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి, ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నం, మిల్ మేకర్ కూర, సాంబారు లలో పరిశీలించారు. మెనులో భాగంగా చట్నీ చేయలేదని అసహనం వ్యక్తంచేశారు.రోజు ఇలాగే చేస్తున్నారా మీ ఇష్టం వచ్చినట్లు పెడితే సహించేది లేదని తప్పనిసరిగా ప్రభుత్వం అందించిన కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని వండిన ఆహారపదార్థాలు ప్రతి ఒక్కరికి కడుపునిండా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. స్టోర్ లో సరుకులు చెక్ చేశారు. నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రామే వాడాలని సూచించారు. టమాటా, బీరకాయ, ఆకుకూరలు అందుబాటులో ఉన్న కూరలతో చట్నీ చేసి పెట్టాలని, వండిన ఆహారపదార్థాలు రుచికరంగా ఉండాలని తెలిపారు.విద్యార్థులతో ఆప్యాయంగా పలకరించి ఆహారం ఎలా ఉంది, రుచిగా ఉందా అని అడగ్గా బాగుంది అని విద్యార్థులు కలెక్టర్ కి తెలిపారు.అనంతరం కోహెడ మండలంలోనినాగసముద్రాల గ్రామంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహం ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అన్నం, క్యాబేజీ కూర, సాంబారు, పెరుగు లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ చెక్ చేస్తూ రాసిన క్యాబేజీ కి వండిన కూర కు అస్సలు పొంతనలేదని కూర బరువు తూకం వేయగా చాలా తేడా వచ్చినందుకు గాను వార్డెన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ డైట్ లో చట్నీ చేయలేదని రిజిస్టర్ లో సరిగ్గా రాయనందుకు గాను వార్డెన్ పైన యాక్షన్ తీసుకోవాలని డిఈఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు. విద్యార్థులకు భోజనం వసతి విషయంలో ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు….

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.