📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetజిల్లా మహిళ సమాఖ్య భవనంలోనిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం..-అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకి జిల్లా కలెక్టర్...

జిల్లా మహిళ సమాఖ్య భవనంలోనిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం..-అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకి జిల్లా కలెక్టర్ కె. హైమావతి..

📰 Generate e-Paper Clip

జిల్లా మహిళ సమాఖ్య భవనంలోనిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం..-అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకి జిల్లా కలెక్టర్ కె. హైమావతి..

సిద్దిపేట జిల్లా, మార్చి 9, ప్రజావాణి

సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో గల జిల్లా మహిళ సమాఖ్య భవనంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకి జిల్లా కలెక్టర్ కె. హైమావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్య, జిల్లా రెవెన్యూఅధికారినాగరాజమ్మ,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సువర్ణ, జిల్లా కో ఆపరేటివ్ అధికారి వరలక్ష్మి, జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి, మహిళ సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…శుష్టికి మూలం స్త్రీ, పూర్వకాలం నుండి వివిధ దేవతల రూపంలో స్త్రీ లను రకరకాల విధంగా పూజిస్తున్నారు.మగ వాళ్ల కంటే ఆడవాళ్ళలు బలహీనులు అంటారు కానీ ఇంట్లో మగ వళ్ళు ఉద్యోగం చేస్తారు ఇంట్లో అన్ని పనులు మహిళలే చేస్తారు. వాళ్ళ కి ఆ శక్తి అమ్మవారి నుండే వచ్చింది. అమ్మవారికి శక్తి శివుడు నుండి వచ్చింది.శివుడు శక్తి వేరు కాదు శివుడు, అమ్మవారు ఒక్కరే.మహిళలు ఏ రంగంలో అయినా అన్ని రకాల పనులు చేస్తారు. మహిళలు మీలో ప్రతి ఒక్కరిలో శక్తి ఉంటుంది మీలో ఉన్న శక్తిసామర్థ్యాలను తెలుసుకోవాలని సూచించారు. ఆ శక్తిని ఏ రకంగాఉపయోగించుకుంటాలో ఆ రంగంలో వృద్ధిలోకి వస్తారు.మంచి నిర్ణల్యలు గొప్ప పనులు, మీ పిల్లలకు మంచి ఎంచుకునే మార్గమని తెలుపుతూ ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చి దిద్దాలని తెలిపారు.ప్రభుత్వం అందించే వివిధ పథకాలను మాత్రమే ఆధారపడకుండా మీరు ఒక ఎంటర్ ప్రైజెస్ గా ఎదగాలని ప్రభుత్యం ఇచ్చేవి ఏదైనా మనకు ఆ రంగంలో ఎదగడానికి మొదటి ఎంట్రీ మాత్రమే తరవాత మీ ఆలోచన క్రమశిక్షతో పనిచేయాలని తెలిపారు.నాబార్డ్, బ్యాంకింగ్, ఇతరత్ర విభాగంలో ఉన్నతంగా ఎదగడానికి పలు రకాల రుణాలు సహాయంతో ఉమ్మడిగా వృద్ధిలోకి ఎదిగే అవకాశం ఉంటుందని మరింత ఉన్నతంగా ఎదగడానికి పలు రంగాల్లో శిక్షణ కూడా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.