📄 ePaper
Wednesday, May 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కమలాపురం క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలానాలు

కమలాపురం క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలానాలు

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్: (మార్చి 09) కడప జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కమలాపురం క్రాస్ రోడ్డులో ఈరోజు ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు సిఐ మోహన్ గారి ఆధ్వర్యంలో, వల్లూరు ఎస్ఐ శివ నాగిరెడ్డి గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, అలాగే మైనర్ పిల్లలు వాహనాలు నడిపిన ఘటనలను గుర్తించి చట్ట ప్రకారం చలానాలు విధించారు.అదేవిధంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి మరియు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.ప్రజల భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందిపాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular