📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialవివాహ వేడుకకు మంత్రి అడ్లూరితో కలిసి హాజరైన పలువురు నాయకులు

వివాహ వేడుకకు మంత్రి అడ్లూరితో కలిసి హాజరైన పలువురు నాయకులు

📰 Generate e-Paper Clip

ఉండేడలో ఘనంగా వివాహ వేడుక

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చి 08 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ఉండేడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన వివాహ వేడుకకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చెందిన పోతూ సుధాకర్ – వనిత దంపతుల ప్రథమ పుత్రిక దీపిక, నరేష్ ల వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి, నూతన వధూవరులను అక్షింతలు వేసి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో మంత్రితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి, ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, పూదరి రమేష్, గ్రామ సర్పంచ్ ఆవుల మమత తిరుపతి, ఉప సర్పంచ్ పోతు రవి, సర్పంచులు కందికట్ల అమృత రాజేశం, బాలసాని శారద మల్లేష్ గౌడ్, సింగిరెడ్డి లింగారెడ్డి నాయకులు గుండ సదానందం, చిలుక లింగయ్య, తుడిచెర్ల వినోద్, చొప్పదండి రాజయ్య, చిలుక రాజయ్య, ఆవుల మల్లేశం, రమేష్ గుప్తా, పాత్రికేయులు నల్లాల కుమార్, బాలసాని శ్రావణ్ కుమార్, నాగ సముద్రాల శ్రీనివాస్, చిలుక సతీష్, బెత్తపు లక్ష్మీరాజం, తదితరులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహానికి విచ్చేసిన అతిథులకు, బంధుమిత్రులకు కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular