
సిద్దిపేట జిల్లా మార్చి 7, ప్రజావాణి
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం శ్రీనివాస్ గుప్త, వీణ,దంపతుల 30 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ల ని సన్మానించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఐ హెచ్ ఆర్ సి ఐ నాయకులు. హైదరాబాదులోని వాళ్ల స్వగృహంలో జరిగిన వివాహ వార్షికోత్సవ వేడుకల్లో ఐ హెచ్ ఆర్ సి ఐ జాతీయ ఉపాధ్యక్షుడు వాక కృష్ణారావు , నేషనల్ సేవాదళ్ చైర్మన్ రాఘవేంద్ర , రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ సామా శ్రీధర్ , రాష్ట్ర మహిళా కార్యదర్శి మేకల దీప , ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రంగపల్లి అంజయ్య స్వామి, సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు సామా ప్రశాంతి , సిద్దిపేట జిల్లా పి ఆర్ ఓ కాసం రాము , నూతన సినీ నటుడు సామా నరేష్ ,తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నేషనల్ వైస్ చైర్మన్ వాకా కృష్ణారావు మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా మానవ హక్కులకు సంబంధించి ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలుస్తూ ఐ హెచ్ ఆర్ సి ఐ అనే సంస్థ స్థాపించి సుమారు 250 మంది జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించి ఎక్కడికక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న కటకం శ్రీనివాస్ గుప్తా దంపతులు అభినందనీయులని మేము సైతం వెంట అంటూ పలువురు స్వచ్ఛందంగా సంస్థలో చేరి ప్రజలకు సహాయ సహకారాలు అందించటానికి ముందుకు రావడం గర్వకారణమని తెలిపారు.




