📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

📰 Generate e-Paper Clip

టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

కడప – తాడిపత్రి జాతీయ రహదారిపై రామచంద్రపురం గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎర్రగుంట్ల వైపు నుండి వస్తున్న AP39Y1326 నంబర్ గల టిప్పర్ వాహనం, AP04BF8622 నంబర్ గల ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో జంగంపల్లి గ్రామానికి చెందిన పుత్తా చంద్రశేఖర్ రెడ్డి (40) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ కమలాపురం పోలీస్ స్టేషన్‌లో తనకు తానుగా లొంగిపోయినట్లు తెలిసింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular