అనాథ ఆడబిడ్డ పెళ్లికి ‘కాంగ్రెస్’ నాయకుల అండ
క్వింటాల్ బియ్యం, 30 వేల రూపాయల ఆర్థిక సాయం
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ మార్చి 07 (ప్రజావాణి):
కష్టాల్లో ఉన్న పేదలకు తోడుగా నిలవడంలోనే నిజమైన మానవత్వం ఉంది అని నిరూపించారు వెల్గటూర్ మండల కాంగ్రెస్ నాయకులు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఓ నిరుపేద యువతి వివాహానికి పెద్దమనసుతో ఆర్థిక సాయం అందించి, తమ ఉదారతను చాటుకున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన పుట్టపాక రజిత తల్లిదండ్రులు లేని నిరుపేద. ఆమె వివాహం నిశ్చయమైనప్పటికీ, పెళ్లి ఖర్చులకు డబ్బుల్లేక కుటుంబం ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్తించారు. ఆమెను తమ ఇంటి ఆడబిడ్డలా భావించి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. వెల్గటూర్ మాజీ ఉపసర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి తన వంతుగా ఒక క్వింటాల్ బియ్యం అందజేశారు. నగదు, వస్త్రాలు ఇతర నాయకులు, దాతలు కలిసి 30 వేల రూపాయల నగదు, ఒక చీరను పెళ్లి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… తల్లిదండ్రులు లేని రజిత పెళ్లికి భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ చిన్న సాయం చేశామని, భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గండ్ర ప్రతాప్ రావు, మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్, వార్డు సభ్యులు గుండాటి సందీప్ రెడ్డి, నక్క సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూపాక ప్రవీణ్, జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ గండ్ర శ్రీకాంత్ రావు పాల్గొన్నారు. వారితో పాటు మండల బీసీ సెల్ అధ్యక్షుడు బందెల ఉదయ్ గౌడ్, స్థానిక నాయకులు పెద్దూరి భరత్ కుమార్, వెలగందుల సంతోష్, గుమ్ముల అజయ్, కొండ లక్ష్మీనారాయణ, లకుమల్ల సాయి తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబానికి కొండంత అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులపై వెల్గటూర్ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.




