📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgondaఆర్థిక సహాయం అందించిన మందడి సరోజ్ రెడ్డి

ఆర్థిక సహాయం అందించిన మందడి సరోజ్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఆర్థిక సహాయం అందించిన మందడి సరోజ్ రెడ్డి

 

ప్రజావాణి దేవరకద్ర:

కౌకుంట్ల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన తెలుగు తిక్క లక్ష్మన్న ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే, హైకోర్టు అడ్వకేట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మందడి సరోజ్ రెడ్డి ఆదివారం బాధితుడు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు మనోబలం కల్పించారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా రూ.20 వేల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుండే నాయకత్వమే నిజమైన ప్రజాసేవకు నిదర్శనం, నాయకుడిగా మాత్రమే కాకుండా, మనసున్న వ్యక్తిగా కూడా తన సానుభూతిని సరోజ్ రెడ్డి చాటుకున్నారని గ్రామస్థులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular