📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarచాణక్య హై స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

చాణక్య హై స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

చాణక్య హై స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

 

 

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి);జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండల కేంద్రంలోని చాణక్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లోజాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పలు విధాల సైన్స్‌ ప్రయోగాలను ప్రదర్శించారు. ప్రతిభచూపిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్ బహుమతులు అందజేసి అభినందించారు.విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు.సైన్స్‌తోనే దేశం అభివృద్ధి జరుగుతుందని, కరోనా వంటి కష్ట కాలంలోనూ మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ తయారు చేసి ఎన్నో దేశాల ప్రజలను కాపాడారని తెలిపారు.

పాఠశాల విద్యా ర్థులు స్వీయ ఆలోచనా ప్రతిభతో 150 కి పైగా విజ్ఞానపరమైన సైన్స్‌, గణితావిష్కరణలను ప్రదర్శించారు. తరగతుల వారీగా పాఠశాల ఆవరణలో సైన్స్‌ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చిన్నారులు తయారుచేసిన ప్రాజెక్ట్‌లు ప్రదర్శించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల కరస్పాండెంట్‌ ఆడెపు రవీందర్ మాట్లాడుతూ.. సర్‌ సీవీ రామన్‌ 1928 ఫిబ్రవరి 28న ‘రామన్‌ ఎఫెక్ట్‌ ’ ఆవిష్కరించిన సందర్భంగా అదే రోజును భారత ప్రభుత్వం జాతీయ సైన్స్‌ దినోత్సవంగా ప్రకటించిందని విద్యార్ధులకు వివరించారు. ఆయన పరిశోధనకు 1930లో నోబెల్‌ బహుమతి కూడా వచ్చిందన్నారు. తమ పాఠశాల విద్యార్థులు కూడా అంతటి ప్రతిభా పాటవాలతో విజ్ఞానాన్ని ఆభరణంగా ధరించాలని ఆశాభావం వ్యక్తం చేశా రు. విద్యార్ధులకు తోడ్పాటు అందించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలోరిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్ సింగిరెడ్డి బాల్ రెడ్డి,సైన్స్ టీచర్ స్వప్న ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు స్ధానికులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular