📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetసీఎం కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన చిలుకూరు వాసి

సీఎం కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన చిలుకూరు వాసి

📰 Generate e-Paper Clip

చిలుకూరు ఫిబ్రవరి24(ప్రజావాణి):ఈనెల 22 23 తేదీలలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సీఎం కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో చిలుకూరు మండల కేంద్రానికి చెందిన యడవల్లి యశ్వంత్ గౌడ్ 110kg ల విభాగంలో స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ మొత్తం కలిపి 290 కిలోల బరువు ఎత్తి మొదటి స్థానం కైవసం చెసుకోని గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అంతేకాకుండా వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో అత్యధిక బరువు ఎత్తిన ప్లేయర్గా స్టేట్ చాంపియన్షిప్ గెలుపొందడం జరిగినది. ఈ సందర్భంగా యశ్వంత్ గౌడ్ ను రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముక్కిరి కీర్తి ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular