📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణWarangalదేవుడి భూమిని కాజేసిన దొంగ ఎవరు..? 4 ఎకరాల దేవుడి...

దేవుడి భూమిని కాజేసిన దొంగ ఎవరు..? 4 ఎకరాల దేవుడి భూమి ఎక్కడ..? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో రాజరాజేశ్వర స్వామి భూమి ఏమైంది..?

📰 Generate e-Paper Clip

దేవుడి భూమిని కాజేసిన దొంగ ఎవరు..?

 

4 ఎకరాల దేవుడి భూమి ఎక్కడ..?

 

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో రాజరాజేశ్వర స్వామి భూమి ఏమైంది..?

 

3 సంవత్సరాల తరువాత విస్తృత పోయే నిజాలు బయటకు ఎందుకు వచ్చాయి..?

ల్యాండ్ ఆక్వేషన్ అధికారి మాటల్లో దేవుడు భూమి ఉందంటూ వీడియో లీక్..

 

అప్పటి ఎమ్మార్వో,ఆర్డీవో చేతివాటమే దినికి గల కారణమా…??

 

ప్రజావాణి/హన్మకొండ : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో రాజరాజేశ్వర స్వామి దేవాలయం పై నాలుగు ఏకరాల భూమి ఉండడం అట్టి భూమి ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాండ్ ఆక్వెషన్ లో భాగంగంగా మొదటి విడత రికార్డులో కూడా చూపించడం జరిగింది.కాకపోతే రెండోవిడత లబ్దిదారుల జాబితా విడత వరకు దేవుడి భూమి కాస్త మాయం అయ్యింది. దీనికోసం వంగర గ్రామస్థులు ఏకంగా పలు సార్లు ఉన్నత అధికారులను కలవడం తో పాటు రోడ్డెక్కి పెద్దఎత్తున నిరసనలు కూడా తెలిపారు. కానీ రికార్డులో భూమి లేదు అంటూ దాటేసారు అధికారులు.హుజురాబాద్ తాలూకాగా ఉన్నప్పటి రెవెన్యూ రికార్డులో అట్టి భూమి ఉన్న ఆధారాలు గ్రామస్థుల వద్ద ఉన్న కూడా పట్టించుకోలేదు.ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ మొదలై 3 ఏళ్ళు గడిచిన తరువాత ఇప్పుడు ల్యాండ్ ఆక్వెషన్ అధికారి వీడియో ఒకటి లికవ్వడం గమనార్హం.. ఆ వీడియోలో దేవుడి పేరుతో భూమి ఉంది దీని డబ్బులు ఎటు వెళ్తాయి అని మాట్లాడుతున్న వీడియో బైటకు వచ్చింది…అయితే ఇది ఏమార్వో ఒక్కరేనా లేక ఆర్డివో కూడా కలిసారా ఇందులో ఎవరెవరు కూడారు..?ఇది కేవలం ఒక్క దేవుడి భూమి వరకే ఆగిందా లేక ఇంకెన్నెన్ని రాజకీయాలు నడిపించారు అని మరో సంచికలో…మీ ప్రజావాణి ద్వారా…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular