అయ్యా పెన్షన్ అవ్వా పెన్షన్
అయ్యా కమిషన్ అవ్వా కమిషన్….
సబ్ ట్రెజరరీ కార్యాలయాలలో అందినకాడికి దండుకుంటున్న సెక్షన్ ఇంచార్జిలు….
పైసలు పెట్టు పెన్షన్ పట్టు బహిరంగ వేలాలే…
ముడుపులు ఇచ్చేవరకు ప్రదక్షణలు తప్పవట…
ప్రజావాణి స్టేట్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ సబ్ ట్రెజరరీ కార్యాలయంలో ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు చొప్పున ఫిక్స్ చేస్తున్న అధికారులు.. పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వృద్ధులు ఇదే అదనుగా చేసుకుని కమిషన్ 10,000 నుండి 30 వేల వరకు గరిష్టంగా వసూలు చేస్తున్న సబ్ ట్రెజరీ కార్యాలయాల అధికారులు. అదేంటయ్యా అంటే అటెండర్ నుండి జిల్లా అధికారి వరకు అందరికీ ఇవ్వాలి కదా మా జేబులో నుండి ఇస్తామా ఏంది అంటూ పొదుపు మాటలు మాట్లాడుతున్నా సిబ్బంది. ఇక హనుమకొండ జిల్లా పరిధిలోని ఓ కార్యాలయంలో ఆ మహిళ ఉద్యోగి పెన్షన్ల కోసం వచ్చిన వారి వద్ద నుండి నేరుగా వసూలు చేపడుతుందట ఇవ్వకపోతే ప్రదక్షిణలు చేయడం వృద్ధుల వంతు గా మారింది. ఆ మేడం కు కానుకలు సమర్పిస్తేనే ఫైలు ముందుకు కదులుతుంది లేకపోతే ఈరోజు జిల్లా కార్యాలయం,రేపు దేవాలయం, ఎల్లుండి సెలవు అంటూ వచ్చిన వారిని ముప్పతిప్పలు పెడుతున్న తీరు వారికే చెందును. అంతేకాదు వారు కార్యాలయానికి రాకున్నా వచ్చిన రోజు హాజరు పట్టికలో అన్ని రోజులు వచ్చినట్టే చేస్తారు. దీని వెనుక ఉండి నడిపిస్తున్నది అటెండరా..? లేక ఉన్నతాధికార..?.ఇది కేవలం ఒక కార్యాలయం పరిదే కాదు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రతి కార్యాలయంలో ఇదే వరుస.మార్పు జరిగేనా మచ్చ తెచ్చేరా వేచి చూడాలి… బాధితుల మాటల్లో మరో సంచికలో..




