*విద్యార్ధుల ఆరోగ్యంతో చెలగాటం సహించేది లేదు*
* *మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు*
*
*విద్యార్ధులతో కలసి క్రింద కూర్చుని వివరాలు ఆడుతున్న ఎమ్మెల్యే*
*ఆహారతనిఖీ, తాగునీటి పరీక్షలు చేయించాలన్న ఎమ్మెల్యే*
ప్రజావాణి ప్రతినిధి రంపచోడవరం ఫిబ్రవరి 7
ప్రభుత్వ పాఠశాలల్లో, వసతిగృహాల్లో విద్యార్ధులకు అందించే ఆహారంలో ఎలాంటి రాజీ పడ్డా చర్యలు తప్పవని రంపచోడవరం ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మారేడుమిల్లి మండలం దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో ఆహార కలుషితం పై శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్ధులతో కలసి క్రింద కూర్చుని పాఠశాలలో పెడుతున్న ఆహార పదార్థాలు వివరాలు, త్రాగునీటి పై ఆరా తీశారు. ఇదే క్రమంలో ఈ రోజు పెట్టిన ఇడ్లీ పిండి, పాలు ప్యాకెట్ లను పరిశీలించారు. వసతి గృహాల్లో ఉన్న వసతులపై ఆరా తీసి మెరుగుపరచాలని కోరారు. కాచి చల్లార్చిన మంచి నీటిని అందించాలని కోరారు.. వంట సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. పాఠశాల సిబ్బంది పై మండిపడ్డారు. పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఎంతమందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది తదితర వివరాలు అడిగారు. విద్యార్ధుల విషయంలో ఎలాంటి లోపాలకు పాల్పడా చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం పెట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహారాలు చేస్తే సహించేది లేదని వార్డెన్ గణపతికి తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రధానోపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంపై మండిపడ్డారు. అలాగే ఆహార పదార్థాలు తనిఖీలు మరియు త్రాగునీటిపై పరీక్షలు చేయించాలని వైద్య సిబ్బంది, RWS అధికారులకు ఆదేశించారు. గ్రామస్తులు మాట్లాడుతూ వసతి గృహంలోకి పర్యవేక్షణకు సమయం అవకాశం ఇవ్వకుండా పాఠశాల సిబ్బంది వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనితో స్పందించిన ఆమె సిబ్బందితో మాట్లాడి గ్రామస్తులతో మంచిగా ఉండాలన్నారు. విద్యార్ధులకు ఎలాంటి అనారోగ్య పరిస్థుతులు ఉన్నా వెంటనే స్పందించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలపై స్పందించిన ఆమె త్వరితగతిన పరిష్కారం చేస్తానని హమీ ఇచ్చారు. అలాగే మారేడుమిల్లి ఆసుపత్రిలో అస్వస్థతకులోనై చికిత్స పొందుతున్న విద్యార్ధులను పరామర్శించి వైద్యులకు పలు సూచనలు చేశారు. అవసరం అయితే మెరుగైన వైద్య సేవలు కొరకు జిల్లా స్థాయి ఆసుపత్రులకు లేదా ప్రయివేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయాలని సూచించారు .
కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సుభానీ, మండల పార్టీ అధ్యక్షులు గురుకు శేషు కుమార్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు మల్లా దుర్గ ప్రసాద్,మండల ప్రధాన కార్యదర్శి కర్రి సన్యాసిరెడ్డి , మాజీ మండలపార్టీ అధ్యక్షులు భీశెట్టి అప్పాజీ, యూనిట్ ఇంచార్జి అందాల సూర్యనారాయణ రెడ్డి , మాజీ మండల ప్రధాన కార్యదర్శి పోడియం శ్రీనుబాబు , మాజీ సర్పంచ్ పొడియం కన్నపు దొర , మాజీ ఎంపీటీసీ కానెం విజయలక్ష్మి ,మాజీ మండలపార్టీ అధ్యక్షులు పుచ్చల గురునాథరెడ్డి , జనసేన నాయకులు జి .ధర్మ తేజ , గ్రామ కమిటీ అధ్యక్షులు రేవుల జానకి రెడ్డి, కురసం బాపన్న దొర , మాజీ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మడకంవెంకటేశ్వర్లు , మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి ఏసుబాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు




