📄 ePaper
5pm
7pm
Sunday, November 29, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణతాగడానికి నీరు లేదు.ప్రయాణానికి బస్సు లేదు.చింతల్‌పేట్‌ వాసుల గోడు పట్టదా?

తాగడానికి నీరు లేదు.ప్రయాణానికి బస్సు లేదు.చింతల్‌పేట్‌ వాసుల గోడు పట్టదా?

📰 Generate e-Paper Clip

గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన బీఆర్ఎస్ నాయకులు మోరిల్ శ్రీనివాస్ రావు.

 తీవ్ర సాగు,తాగునీటి ఎద్దడి.ఖాళీ బిందెలతో మహిళల నిరసన.

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని డిమాండ్.

బాన్సువాడ/ప్రజావాణి: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని చింతల్ పేట్ తండా, చింతల్ పేట్ గ్రామాలు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.సాగు, తాగునీటి ఎద్దడితో పాటు రవాణా సౌకర్యం లేక ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు మోరిల్ శ్రీనివాస్ రావు నియోజక వర్గ నాయకులతో కలిసి ఆదివారం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా మోరిల్ శ్రీనివాస్ రావు,అంజిరెడ్డి,డా.ఏం.ఏ. హకీమ్ మాట్లాడుతూ.గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూపందాల్చిందని,వంట చేసుకోవడానికి,కనీస అవసరాలు తీర్చుకోవడానికి నీళ్లు దొరకని దయనీయ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.నీటి కష్టాలు భరించలేక మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.మరోవైపు గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు,రోగులు, విద్యను అభ్యసించడానికి అలాగే అత్యవసర పనులపై బయటకు వెళ్లే గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.గతంలో సాగునీరు అందక సుమారు 2000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వివరించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి కాకపోవడం ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడం వల్లే రైతులు,ప్రజలకు ఈ దుస్థితి దాపురించిందని ఆరోపించారు.ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.పింఛన్లు, రైతుబంధు,కళ్యాణలక్ష్మి,తులం బంగారం వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.ఈ గ్రామా ల్లో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. అధికారులు,ప్రజాప్రతినిధులు వెంటనే గ్రామాన్ని సందర్శించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని.గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని,నిలిచిపోయిన సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కామరెడ్డి జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి, నియోజక వర్గ బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్,డాక్టర్ ఎం.ఏ.హకీమ్, హన్మండ్లు,సంజీవులు,శ్రీనివాస్,చింతల్ పేట్ తండా,చింతల్ పేట్ గ్రామాల నాయకులు రాందాస్,సుధాకర్,దౌలత్ రామ్,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.