తాగడానికి నీరు లేదు.ప్రయాణానికి బస్సు లేదు.చింతల్పేట్ వాసుల గోడు పట్టదా?
గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన బీఆర్ఎస్ నాయకులు మోరిల్ శ్రీనివాస్ రావు. తీవ్ర సాగు,తాగునీటి ఎద్దడి.ఖాళీ బిందెలతో మహిళల నిరసన. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని డిమాండ్. బాన్సువాడ/ప్రజావాణి: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని చింతల్ పేట్ తండా, చింతల్ పేట్ గ్రామాలు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.సాగు, తాగునీటి ఎద్దడితో పాటు రవాణా సౌకర్యం లేక ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు మోరిల్ శ్రీనివాస్ రావు నియోజక వర్గ నాయకులతో...