📄 ePaper
5pm
7pm
Sunday, November 29, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్పెండింగ్ చలాన్లంటూ నకిలీ లింకులు.. క్లిక్ చేస్తే సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదం

పెండింగ్ చలాన్లంటూ నకిలీ లింకులు.. క్లిక్ చేస్తే సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదం

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, నవంబర్ 29 (ప్రజావాణి)

పెండింగ్ చలాన్ల పేరుతో నకిలీ వాట్సాప్ సందేశాలు పంపిస్తూ సైబర్ మోసగాళ్లు వాహనదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ‘Vehicleinfo’ పేరుతో గుర్తింపు పొందిన ఖాతా మాదిరిగా సందేశాలు పంపి, చలాన్లు చెల్లించాలంటూ నకిలీ లింకులను పంపిస్తున్నారు. తాజాగా ఓ ద్విచక్ర వాహనదారుడికి రెండు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని, రూ.100 జరిమానా చెల్లించాలంటూ వాట్సాప్ సందేశం రావడంతో అప్రమత్తమయ్యాడు. అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చలాన్ వివరాలను పరిశీలించగా, సందేశంలో పేర్కొన్న మొత్తానికి వాస్తవ చలాన్ మొత్తం భిన్నంగా ఉండడంతో మోసాన్ని గుర్తించాడు. ఇలాంటి అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయడం, బ్యాంకు వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ నమోదు చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. వాహనదారులు వాట్సాప్ సందేశాలను నమ్మకుండా అధికారిక ఈ-చలాన్ వెబ్‌సైట్‌లో మాత్రమే చలాన్ల వివరాలు పరిశీలించి చెల్లించాలని సూచిస్తున్నారు. సైబర్ మోసాల బారిన పడితే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.