పెండింగ్ చలాన్లంటూ నకిలీ లింకులు.. క్లిక్ చేస్తే సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదం

  బెజ్జంకి, నవంబర్ 29 (ప్రజావాణి) పెండింగ్ చలాన్ల పేరుతో నకిలీ వాట్సాప్ సందేశాలు పంపిస్తూ సైబర్ మోసగాళ్లు వాహనదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ‘Vehicleinfo’ పేరుతో గుర్తింపు పొందిన ఖాతా మాదిరిగా సందేశాలు పంపి, చలాన్లు చెల్లించాలంటూ నకిలీ లింకులను పంపిస్తున్నారు. తాజాగా ఓ ద్విచక్ర వాహనదారుడికి రెండు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని, రూ.100 జరిమానా చెల్లించాలంటూ వాట్సాప్ సందేశం రావడంతో అప్రమత్తమయ్యాడు. అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చలాన్ వివరాలను పరిశీలించగా, సందేశంలో పేర్కొన్న మొత్తానికి వాస్తవ చలాన్ మొత్తం భిన్నంగా ఉండడంతో మోసాన్ని...