నిజాయితీకి గుర్తింపు.. రైతుల అభివృద్ధికి కృషి.
కొండాపూర్ నవంబర్ 29 (ప్రజావాణి): మండలంలోని చెర్లగోపులారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పట్లం రత్నయ్య నియామకానికి గుర్తింపుగా మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా అవకాశం కల్పించడం పట్ల గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామ సర్పంచ్‌గా, అనంతరం మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయనకు మరోసారి మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా అవకాశం కల్పించడం పట్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చెర్లగోపులారం గ్రామం మల్లేపల్లి నుంచి విడిపోయి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన సమయంలో గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేసిన వారిలో పట్లం రత్నయ్య ఒకరు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేశారు. ముఖ్యంగా గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందారు.
గ్రామ సర్పంచ్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, రైతుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, వ్యవసాయ రంగ అభివృద్ధికి సహకరించడం, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచాయి.
ఈ నేపథ్యంలో ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి, నిర్మల్ జగారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకత్వం, గ్రామ ప్రజల సహకారంతో మరోసారి మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం కల్పించారు. ఈ నియామకం పట్ల గ్రామ ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా తనకు లభించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన వంతు సహకారం అందిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
నూతన బాధ్యతలతో రైతుల సంక్షేమం, గ్రామాభివృద్ధికి మరింత సేవ చేసే అవకాశం
లభించిందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. పట్లం రత్నయ్య నియామకం పట్ల పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలియజేస్తున్నారు.

