గ్రామాలను సమూలంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి
సజ్జపూర్ లో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణిలో : సర్పంచ్ కె పద్మావతి
జహీరాబాద్, నవంబర్ 28 (ప్రజావాణి): అన్నీ సేవలను ఒకే కార్డు ద్వారా పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రారంభించిందని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను చేరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సర్పంచ్ కుడిముస్కుల పద్మావతి అన్నారు. శనివారం నాడు సజ్జపూర్ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణి చేపట్టారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ సరుకులు పొందడంలో మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ పరిశ్రమిక వేత్త, అసెంబ్లీ కాంగ్రెస్ నాయకులు కె ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణి చేయబోతున్నారని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తెల్లారేషన్ కార్డులు మంజూరు చేస్తుందని, ఇల్లు లేనివారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

