📄 ePaper
5pm
7pm
Monday, November 30, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్చిలుపూర్ లో రవి చంద్ర పార్థివదేహానికి నివాళులర్పించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

చిలుపూర్ లో రవి చంద్ర పార్థివదేహానికి నివాళులర్పించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): జనగామ జిల్లా చిలుపూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు నారగోని రవి చంద్ర మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం చిలుపూర్‌లో రవి చంద్ర పార్థివదేహం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రవి చంద్రతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఎంతో చురుగ్గా పనిచేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్న మంచి యువ నాయకుడని కొనియాడారు. ప్రతి ఎన్నికలోనూ, పార్టీ కార్యక్రమాల్లోనూ తనతో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. చిన్న వయసులోనే రవి చంద్ర మనందరినీ విడిచిపెట్టి వెళ్లిపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రవి చంద్రతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. రవి చంద్ర భౌతికంగా మన మధ్య లేకపోయినా పార్టీ కోసం ఆయన చేసిన కృషి, ప్రజలతో ఆయనకున్న అనుబంధం ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓదార్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.