బిఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్ పేరుతో రాజకీయ ప్రచారం చేయడం కాదు
తెలంగాణ అమరవీరుల త్యాగాలను గౌరవించాలి
* కాంగ్రెస్ నాయకుడుపాతకాల ప్రవీణ్
జమ్మికుంట నవంబర్ 27 (ప్రజావాణి)
తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక్క వ్యక్తి పోరాటం వల్లనో ఒక్క రాజకీయ పార్టీ వల్లనో సాధ్యమైనది కాదువేలాది మంది ప్రజల ఉద్యమాలు విద్యార్థుల పోరాటాలు ఎన్నో కుటుంబాల త్యాగాలు తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల రక్తంకన్నీళ్లు త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల ప్రవీణ్ అన్నారుదీక్షా దివస్ పేరుతో నేడు కొందరు బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తమ రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చుకోవడం సరికాదని, తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను ఏ ఒక్కరూ తమ రాజకీయ స్వార్థానికి పరిమితం చేయలేరని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం అనేది ఒక్కరి పోరాటానికి ప్రతీక కాదుఅది కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఉద్యమకారుల పోరాటానికి అమరవీరుల త్యాగాలకు ప్రతిబింబమని పేర్కొన్నారుహుజురాబాద్ శాసనసభ్యులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ పెద్దల మెప్పు పొందడానికే ప్రాధాన్యత ఇచ్చిన నాయకులు నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారంపై సరైన దృష్టి సాదించలేకపోతున్నారని విమర్శించారుకానీ నేడు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్న ప్రజల మధ్య ఉంటూప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజా ప్రయోజన కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా బాధ్యతతో కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారుతెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తోందని, సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారురాజకీయ విమర్శలు చేయడం కంటే ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం నాయకుల బాధ్యత అని, తెలంగాణ ఉద్యమ అమరవీరుల త్యాగాలను గౌరవిస్తూ వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల ప్రవీణ్ తెలిపారు

