చిన్న మోదుగుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రాయల భవాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తన్నీరు నాగేశ్వరరావు
వత్సవాయి, నవంబర్ 27 మన ప్రజావాణి
వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనకు – కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి
గ్రామీణ పల్లెల్లో మార్పు మొదలైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్న ప్రజానీకం
జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, చిన్న మోదుగుపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాయల భవాని, వివిధ వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలను, ఓటర్లను కలిసి సర్పంచ్ అభ్యర్థి రాయల భవానికి మంచం గుర్తుపై, అలాగే వివిధ వార్డుల అభ్యర్థులకు కేటాయించిన గుర్తులపై ఓటు వేసి మద్దతు తెలియజేయాలని కోరారు.
ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు అందించి, నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేశామని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనతో పోల్చి చూసి, ప్రజలు తమ అనుభవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల హామీలను పరిశీలించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

