*ఎంఎస్ఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక*
*జిల్లా ఉపాధ్యక్షుడిగా మారపల్లి సాయికుమార్*
* *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ లింగంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం గురువారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని స్నేహ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎంఎస్ఎఫ్ ఇంచార్జ్ డాక్టర్ కొమ్ము శేఖర్ అధ్యక్షతన ఎమ్మెస్ ఎఫ్ జిల్లా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి లింగంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెస్ ఎఫ్ విద్యాల సంఘాన్ని సంస్థగతంగా బలోపేతం చేసేందుకు నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని సీనియర్ నాయకులందరూ ఏకమై, తమ అనుభవాలను పంచుకొని, జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎఫ్ జిల్లా నూతన కమిటీలో రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన మారపల్లి సాయికుమార్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఎంఎస్ఎఫ్ జిల్లా నూతన అధ్యక్షుడిగా చెన్నూరి విష్ణు, అధికార ప్రతినిధిగా చిప్పకుర్తి సతీష్, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల నితిన్, ఉపాధ్యక్షులుగా మరపెల్లి సాయి కుమార్, కుశ్నపెళ్లి ప్రశాంత్, కొల్లూరి రవి, కోశాధికారిగా శనిగారపు శశికుమార్, కార్యదర్శులుగా అమ్ముల ప్రశాంత్, చిప్పకుర్తి అనిల్, కేంద్రమైన మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి అయిల్ల ప్రశాంత్, జిల్లా సహాయ కార్యదర్శులుగా గోగర్ల యాదగిరి, చిప్పకుర్తి మురారి, అవునూరి హేమంత్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా రామగిరి నందు, అయిల్ల సుశాంత్, బచ్చల నాగరాజు, మిట్టపల్లి క్రాంతి కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

