📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్జీడికల్ కళ్యాణానికి వచ్చే ఎమ్మెల్యే కళ్లెం దారిలో రావాలి.. బిఎస్పి నాయకుల విజ్ఞప్తి

జీడికల్ కళ్యాణానికి వచ్చే ఎమ్మెల్యే కళ్లెం దారిలో రావాలి.. బిఎస్పి నాయకుల విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):జనగామ నుండి జీడికల్ వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులలో ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర నాయకులు మడిపడిగ చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు ఇరుగు మహేందర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రోడ్డుపై కంకర పోసి పది రోజులు గడుస్తున్నా, తదుపరి పనులు చేపట్టకుండా అలాగే వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిరోజూ ఈ మార్గంలో వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కంకర తేలిన ఈ రహదారిపై ప్రయాణించడం వల్ల ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులు పడుతున్న ఈ నరకయాతనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

రేపు జీడికల్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుందని, ఈ వేడుకలకు హాజరయ్యే స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి వేరే మార్గంలో కాకుండా, జనగామ నుండి కళ్లెం, సిరిపురం మీదుగా ఉన్న ఇదే రహదారిపై ప్రయాణించి స్వామివారి దర్శనానికి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

ఆయన ఈ మార్గంలో ప్రయాణిస్తేనే సామాన్య ప్రజలు, భక్తులు రోడ్డుపై పడుతున్న కష్టాలు ఏమిటో ప్రత్యక్షంగా తెలుస్తాయన్నారు.

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మబ్బు ఉదయ్, తాండ్ర అఖిల్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.