జీడికల్ కళ్యాణానికి వచ్చే ఎమ్మెల్యే కళ్లెం దారిలో రావాలి.. బిఎస్పి నాయకుల విజ్ఞప్తి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):జనగామ నుండి జీడికల్ వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులలో ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర నాయకులు మడిపడిగ చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు ఇరుగు మహేందర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోడ్డుపై కంకర పోసి పది రోజులు గడుస్తున్నా, తదుపరి పనులు చేపట్టకుండా అలాగే వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఈ మార్గంలో వందలాది మంది ప్రయాణికులు...