📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజర్నలిజమే వృత్తి.. సామాజిక సేవే ప్రవృత్తి

జర్నలిజమే వృత్తి.. సామాజిక సేవే ప్రవృత్తి

📰 Generate e-Paper Clip

జర్నలిజమే వృత్తి.. సామాజిక సేవే ప్రవృత్తి!

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నల్లబెల్లి సాంబయ్యపటేల్ ప్రస్థానం

20 ఏళ్లుకు పైగా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం.. జర్నలిస్టుగా, సామాజిక సేవకుడిగా ప్రత్యేక గుర్తింపు

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం, లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు నల్లబెల్లి సాంబయ్యపటేల్ జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. గత రెండు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుగా కొనసాగుతున్న ఆయన ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ బాధితుల గొంతుకను తన వార్తల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.

విలేకరిగా విధులు నిర్వహించడం మాత్రమే కాకుండా సామాజిక సేవలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి నవతెలంగాణ ధ్వని వంటి పత్రికల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ఇబ్బందులు, ప్రభుత్వ పథకాల అమలులో జరుగుతున్న లోపాలను తన కథనాల ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నారు. సమస్యలను వార్తలకే పరిమితం చేయకుండా వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు.

సామాజిక సేవలోనూ ముందడుగు

జర్నలిజంతో పాటు సేవా కార్యక్రమాలపై ఆసక్తి కలిగిన నల్లబెల్లి సాంబయ్యపటేల్ ఇటీవల కలాం ఫౌండేషన్‌లో సభ్యత్వం తీసుకున్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సర్వర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, నిరుపేదలు, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పింఛన్లు అందేలా కృషి చేస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. బాధితులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఎక్కడైనా అన్యాయం జరిగినా బాధితులకు అండగా నిలవడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తోంది.

యువతకు ఆదర్శంగా జర్నలిస్టు

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడం వంటి బాధ్యతలను నల్లబెల్లి సాంబయ్య పటేల్ నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. జర్నలిజం అంటే కేవలం వార్తలు రాయడం మాత్రమే కాదని, సమాజం పట్ల బాధ్యతతో పనిచేయడమని తన సేవల ద్వారా చాటిచెబుతున్నారు.

వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే సామాజిక సేవకు సమయం కేటాయిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న ఆయన ప్రస్థానం నేటి యువ జర్నలిస్టులకు, యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జర్నలిస్టుగా, సేవకుడిగా నల్లబెల్లి సాంబయ్యపటేల్ సాగిస్తున్న ప్రయాణం అభినందనీయమని అధికారులు,ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు,ప్రజలు అంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.