📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్

📰 Generate e-Paper Clip

*ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్*

మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్, నవంబర్ 27:

మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ కృష్ణ కాలనీ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్
మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.

కృష్ణా కాలనీలో ఇళ్ల మధ్య పిచ్చి మొక్కలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేయించారు.

నిన్న సాయంత్రం సమస్యను తెలియజేయగా, తెల్లవారుజామునే పరిష్కారం చూపడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇంత వేగంగా తమ సమస్యలు పరిష్కారం కాలేదని, కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్ గారు ఎన్నికైనప్పటి నుంచి తమకు అనేక సేవలు అందిస్తూ, సమస్యలను పరిష్కరిస్తున్నారని ప్రజలు అభినందించారు.

ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్న కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్ గారికి కృష్ణా కాలనీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.