ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమం
మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి (నవంబర్ :27
గౌడ్చర్ల గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమం
గౌడ్చర్ల: గ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గౌడ్చర్ల గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు. అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

