📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజర్నలిస్టుల ఐక్యతకు వేదికగా టీయూడబ్ల్యూజే మహాసభలు

జర్నలిస్టుల ఐక్యతకు వేదికగా టీయూడబ్ల్యూజే మహాసభలు

📰 Generate e-Paper Clip

*జర్నలిస్టుల ఐక్యతకు వేదికగా టీయూడబ్ల్యూజే మహాసభలు*

*డిసెంబర్ 1న నిర్మల్‌లో తృతీయ జిల్లా మహాసభలు.. విజయవంతం చేయాలని జర్నలిస్టులకు పిలుపు*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, భైంసా, నవంబర్ 27:–
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిర్మల్ జిల్లా తృతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రమోద్ రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ 1న నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న జిల్లా మహాసభల ప్రచారంలో భాగంగా శుక్రవారం భైంసా పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవనంలో మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యతను చాటడంతో పాటు వారి సమస్యలు, హక్కులు, సంక్షేమ అంశాలపై చర్చించేందుకు మహాసభలు కీలక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలోని జర్నలిస్టులందరూ సంఘటితంగా ముందుకు వచ్చి మహాసభల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జర్నలిస్టుల వృత్తిపరమైన భద్రత, సంక్షేమ పథకాల అమలు, అక్రిడిటేషన్, ఇతర సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం పోరాడుతోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు కలిముద్దీన్ ఖలీద్, బషీర్, షకీల్ అహ్మద్, ఆర్. విజయ్, సతీష్, రామకృష్ణ, సురేష్, అఫ్రోజ్ ఖాన్, ఆహాద్ సాహిల్, షేక్ అహ్మద్, కొజ్జాల మహేష్, శ్రీనివాస్, సత్యనారాయణ, షేక్ ఇస్మాయిల్, రూపేష్, సయ్యద్ సాజిత్, రవి, వెంకట్ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.