📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు

కష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు

📰 Generate e-Paper Clip

*కష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు*
*విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి –* *ఆర్డీవో సోమిరెడ్డి*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, నవంబర్ 27 (ప్రజావాణి): మంచాల కష్టపడి చదివితేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆర్డీవో సోమిరెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండల కేంద్రంలోని కస్తూర్బా గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.50 వేల విలువైన పిండి కలిపే యంత్రంతో పాటు విద్యార్థులు వినియోగించుకునేందుకు టబ్బులు, జగ్‌లు, గ్రంథాలయానికి పుస్తకాలను విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.